AP : ఏపీకి మరో ముప్పు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

AP : ఏపీకి మరో ముప్పు

Rains

Another low pressure in Bay of Bengal : ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం కోమరిన్ ప్రాంతంతో పాటు దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది.

ఇది సగటు సముద్ర మట్టానికి.. 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 29 తేదీ వరకు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

MLC Madhav : మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే అభాసుపాలు కాక తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్

ఏపీని వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలతో కొన్ని జిల్లాలు వణికిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు అపారనష్టాన్ని వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. వరద ఉధృతికి ఎంతోమంది కొట్టుకుపోయారు. పలువురి మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీయగా..మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసేందే. తక్షణమే రూ. 1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఈక్రమంలో వరద నష్టం అంచనా వేసేందుకు నవంబర్ 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది.