RRR Arrest: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్

RRR Arrest: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్

Rrr Arrest

రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ను ముందుగా అడ్డుకున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు. రఘురామకృష్ణరాజుకు వలయంగా మారారు సీఆర్పీఎఫ్ పోలీసులు. ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అరెస్ట్ చేయనిస్తామని అంటున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు.

సివిల్ డ్రెస్‌లో వచ్చిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి తీసుకని వెళ్లారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బలవంతంగా రఘురామ రాజును తీసుకెళ్లారు ఏపీ సీఐడీ పోలీసులు.

జగన్‌పై అసభ్య పదజాలంతో ఇటీవల సోషల్ మీడియాలో మాట్లాడారని ఈమేరకు కేసులు నమోదైనట్లుగా కూడా చెబుతున్నారు. రాజు టార్గెట్‌గా ఏపీ అధికారులు తెలంగాణకు రాగా.. ఈరోజు రఘురామకృష్ణరాజు పుట్టినరోజు కాగా ఇంట్లోనే ఉన్నారు. ఇటీవలే జగన్ బెయిల్ రద్దు చెయ్యాలంటూ రాజు సీబీఐ కోర్టులో పిటీషన్ కూడా వేశారు.

Rrr

Rrr