సీఎం జగన్ గుడ్ న్యూస్, ఏప్రిల్‌లో కీలక కార్యక్రమాలు ప్రారంభం

సంక్షేమ పథకాలు అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నారు. లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్, తాజాగా మరికొన్నింటికి రూపకల్పన చేశారు.

సీఎం జగన్ గుడ్ న్యూస్, ఏప్రిల్‌లో కీలక కార్యక్రమాలు ప్రారంభం

Ap Cm Jagan Good News

ap cm jagan good news: సంక్షేమ పథకాలు అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నారు. లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్, తాజాగా మరికొన్నింటికి రూపకల్పన చేశారు. ఏప్రిల్ లో వాటిని కూడా ప్రారంభించనున్నారు. ఇందులో భాగమే వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం. ఉగాది రోజున ఏప్రిల్ 13న వాలంటీర్లను సత్కరించనున్నారు. అదే సమయంలో మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను సీఎం జగన్ వివరించారు.

ఏప్రిల్‌ 2021లో ముఖ్యమై కార్యక్రమాలను వెల్లడించిన సీఎం
* ఏప్రిల్‌ 9న జగనన్నవిద్యాదీవెన
* ఏప్రిల్‌ 13న వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం
* ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి
* వాలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించాలి
* వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి
* వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది
* ఏప్రిల్‌ 16న రైతులకు వైయస్సార్‌ సున్నావడ్డీ డబ్బులు
* ఏప్రిల్‌ 20న రైతులకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ డబ్బులు
* ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన

ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు కారణంగా చాలా రోజులగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయాను అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్న సీఎం జగన్.. అది కూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టిపెట్టే అవకాశం ఉంటుందన్నారు.

ఉపాధి హామీ పనులు, ఇళ్ల పట్టాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో నాడు-నేడు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్‌ కాలేజీలు, ఆర్‌ అండ్‌ బి, వైయస్సార్‌ బీమా, జగన్నతోడు, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా ప్రగతి, రబీ-2020, ఖరీఫ్‌-2021 పంటల కొనుగోళ్లు, వీటితోపాటు ఏప్రిల్‌లో ప్రారంభించనున్న జగనన్న విద్యా దీవెన, వాలంటీర్లకు సత్కారం, వైయస్సార్‌ సున్నా వడ్డీ రైతులకు, వైయస్సార్‌ సున్నా వడ్డీ స్వయం సహాయ సంఘాలకు, జగనన్న వసతి దీవెన కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.