CM Jagan : వైఎస్సార్ ఈబీసీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. 3,92, 674 మంది అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ

అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.

CM Jagan : వైఎస్సార్ ఈబీసీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. 3,92, 674 మంది అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ

Ysr Ebc

YSR EBC NESTAM scheme : ఏపీలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం అయింది. మంగళవారం (జనవరి25,2022) తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి సీఎం జగన్ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 3 లక్షల 92 వేల 674 మంది పేద మహిళలకు రూ.589 కోట్లను అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం 45,000 ఆర్థికసాయం అందించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వాగ్ధానం ఇవ్వకపోయినా.. ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అగ్రవర్ణ పేదలకు మంచి జరగాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 3.93 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈబీసీ నేస్తం పథకం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం కాదన్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.