రోజూ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ-ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నుంచి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. రోజుకు 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు నుంచి సీఎం గ్రామాల పర్యటన, 3 రాజధానుల అంశంలో భాగంగా సెక్రటేరియట్ ను విశాఖకు తరలించటం వంటి అంశాలు…ప్రస్తుత అమరావతి ప్రాంత అభివృధ్ది కోసం ఆయన ఎమ్మెల్యేల సమావేశంలో వారితో చర్చించనున్నారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 10 మంది ఎమ్మెల్యేలను సీఎం జగన్ కలవనున్నారు. నియోజక వర్గాల సమస్యలు, పధకాల అమలు, నిధుల కేటాయింపు, అంశాలపై ఆయన వారితో చర్చిస్తారు. ఆగస్టు నుంచి సీఎం గ్రామాల్లో పర్యటించనున్న నేపధ్యంలో ఎమ్మెల్యేలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం జగన్ గ్రామాల పర్యటనకు సంబంధించిన రోడ్డు మ్యాప్ కూడా అధికారులు ఇప్పటికే సిధ్దం చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేతోనూ ఆయన విడివిడిగా భేటీ అయి వారి వారి నియోజక వర్గాల పై చర్చించనున్నారు. ఈ భేటీలో నియోజక వర్గాల సమస్యలతో పాటు అక్కడ అమలవుతున్న ప్రభుత్వ పధకాల గురించి కూడా తెలుసుకోనున్నారు.
Read: రాజధాని రైతులకు తీపి కబురు : కౌలు నిధుల విడుదల