AP Covid 19 – ఏపీలో కరోనా కేసులు 183..ఒకరు మృతి

24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid 19 – ఏపీలో కరోనా కేసులు 183..ఒకరు మృతి

Ap Corona

AP Corona : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. 24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,69,119 పాజిటివ్ కేసులకు గాను… 20,52,494 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14 వేల 431 మంది చనిపోయారు.

Read More : TBGKS : కేంద్రంపై గుస్సా, సింగరేణిలో సమ్మె సైరన్

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 వేల 194గా ఉందని తెలిపింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 38 వేల 863 శాంపిల్స్ పరీక్షించగా…183 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఒక్కరు మరణించారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,02,86,530 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : CM Jagan : వైద్య రంగంలో 60వేల పోస్టులు భర్తీ, సీఎం జగన్ కీలక ప్రకటన

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 05. చిత్తూరు 25. ఈస్ట్ గోదావరి 13. గుంటూరు 30. వైఎస్ఆర్ కడప 06. కృష్ణా 27. కర్నూలు 04. నెల్లూరు 15. ప్రకాశం 07. శ్రీకాకుళం 21. విశాఖపట్టణం 17. విజయనగరం 01. వెస్ట్ గోదావరి 12. మొత్తం : 183.

Read More : CM Jagan : ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, సీఎం జగన్

కొత్త కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ లు  ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని నిపుణులు వెల్లడిస్తున్నారు.