TBGKS : కేంద్రంపై గుస్సా, సింగరేణిలో సమ్మె సైరన్

బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ..సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆరు డిమాండ్లతో బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది.

TBGKS : కేంద్రంపై గుస్సా, సింగరేణిలో సమ్మె సైరన్

Tbgks Union Serve Strike Notice In Singareni

Strike Notice In Singareni : సింగరేణిలో కొద్ది రోజుల తర్వాత సమ్మె సైరన్ మోగింది. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ..సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆరు డిమాండ్లతో బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే…వచ్చే నెల 09వ తేద నుంచి సమ్మెలోకి వెళుతామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అల్టిమేటం జారీ చేసింది. కేంద్రం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. కోయగూడెం బ్లాక్ -3, శ్రావణిపల్లి బొగ్గు గనులు, సత్తుపల్లి బ్లాక్ – 3, కల్యాణ్ ఖని బ్లాక్ – 6 ఈ గనులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది.

Read More : Viral Video:‘నా పెన్సిల్ దొంగిలించాడు..ఈడిమీద కేసు పెట్టటండి సార్..’ పోలీసులకు బుడ్డోడు ఫిర్యాదు..

దీంతో పాటు పలు డిమాండ్లను సంఘం లేవనెత్తింది. అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయస్సును 35 నుంచి 40కి పెంచాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించలేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసింది.
నాలుగు గనుల ప్రారంభోత్సవానికి సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చించి…పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రైవేటీకరణకు గురవుతుండడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కేంద్ర మంత్రిత్వశాఖ నిర్వహించే వేలం పాటను రద్దు చేయాలంటూ…ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభించాయి. ఈ విషయంలో కలిసికట్టుగా పోరాటాలకు జాతీయ సంఘాల నేతృత్వంలో నాయకులు సన్నద్ధమౌతున్నట్లు సమాచారం.