AP : కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి ఘటనలో ట్విస్ట్: వివాహేతర సంబంధం..ఒకరి హత్యకు కుట్ర..

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి ఘటనలో ట్విస్ట్..ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని..దీనికి కారణం వివాహేతర సంబంధమని తేలింది. ఒకరి హత్యకు కుట్ర.

AP : కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి ఘటనలో ట్విస్ట్: వివాహేతర సంబంధం..ఒకరి హత్యకు కుట్ర..

Ap Crime

East godavari police chased kalthi kallu case : వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఏకంగా సాటి మనిషిని కిరాతకంగా చంపేసే దారుణాలకు ప్రేరేపిస్తున్నాయి. ఏపిలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో వివాహేతర సంబంధమే కారణంగా మారింది. కల్తీకల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది పోలీసులు దర్యాప్తులో..తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి కల్తీ కల్లు..ఐదుగురి మృతికి కారణమైనకేసులో వివాహేతన సంబంధమే కారణమని తేల్చారు పోలీసులు. రాంబాబు అనే వ్యక్తికి మృతుడు గంగరాజు భార్యతో అక్రమ సంబంధం వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read : East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగ కల్లు తాగి ఇటీవల ఐదుగురు గిరిజనులు చనిపోయారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపాయి. ఐదుగురి ప్రాణాలు తీసిన జీలుగ కల్లు శాంపిల్స్‌ను సేకరించి వాటిని కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పరీక్షల కోసం పంపారు. గిరిజనులు తాగిన కల్లులో క్రిమి సంహారకం కలిసినట్లుగా నిపుణులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా నమూనాలను పంపించారు. సాధారణంగా జీలుగ చెట్టు నుంచి తీసిన కల్లు తాగితే చనిపోయే అవకాశం లేదు. కానీ దీని వెనుక ఏదో జరిగిందన్న కోణంలో అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఎవరైనా కావాలనే ఇలా చేశారా? అని అనుమానించిన పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లుగా అసలు గుట్టు రట్టు అయ్యింది. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబుకు వివాహేతర సంబంధ ఉందని అందుకే సదరు వ్యక్తిని చంపటానికి రాంబాబు కావాలనే జీలుగ కల్లులో గడ్డిమందు కలిపినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అది తెలియక ఆ కల్లు తాగిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. అలా ఒకరిని చంపటానికి కల్లులో గడ్డిమందు కలిపి ఐదురు ప్రాణాలు తీశాడు రాంబాబు.

Also read : Karimnagar : సెల్పీ మోజులో కాలువలో పడ్డ ఫోన్ …. ఫోన్ కోసం కాలువలో దిగి యువకుడు గల్లంతు

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో లోదొడ్డి గ్రామం వుంది. గ్రామస్తులైన పొత్తూరి గంగరాజు , భూసాని సన్యాసిరావు , లోవరాజు, చెదల సుగ్రీవు, కూడె ఏసుబాబులు రోజులోగే ఓ రోజున తెల్లవారుజామున జీలుగ చెట్టు వద్దకు వచ్చి కల్లు తాగారు. ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే వీరంతా నూరగలు కక్కుతూ ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు జెడ్డంగి హాస్పిటల్ కు తరలించారు.

కానీ అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పాటు బాధితుల పరిస్ధితి అప్పటికే విషమంగా మారింది. దీంతో ఏలేశ్వరం ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో లోవరాజు, సుగ్రీవు దారిలోనే చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గంగరాజు, సన్యాసిరావు, ఏసుబాబులు చనిపోయారు.

ఈ దారుణానికి కారణం వావిహేత సంబంధం కారణమని తేల్చారు పోలీసులు. రాంబాబు అనే వ్యక్తికి మృతుడు గంగరాజు భార్యతో అక్రమ సంబంధం వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.