Kollu Ravindra Released : మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విడుదల

మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టులో పోలీసులకు చుక్కెదురైంది. పోలీసుల రిమాండ్ పిటీషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రవీంద్రను న్యాయమూర్తి విడుదల చేశారు.

Kollu Ravindra Released : మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విడుదల

Kollu Ravindra

Kollu Ravindra released : మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టులో పోలీసులకు చుక్కెదురైంది. పోలీసుల రిమాండ్ పిటీషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రవీంద్రను న్యాయమూర్తి విడుదల చేశారు. వైసీపీ కార్యాలయ స్థల వివాదంలో రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. రవీంద్రపై 353, 188, 341 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అనేక నాటకీయ పరిణామాల మధ్య రవీంద్రకు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం రెండవ అదనపు న్యాయమూర్తి ఎదుట రవీంద్రను పోలీసులు హాజరుపర్చారు. రవీంద్ర తరుపున న్యాయవాదులు తిరుమాని విష్ణుతేజ, లంకే వెంకటేశ్వరరావు, పుప్పాల ప్రసాద్ వాదనలు వినిపించారు.

Supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం

41 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. న్యాయమూర్తి పోలీసుల రిమాండ్ పిటీషన్ ను తిరస్కరించారు. విచారణ అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రవీంద్రను న్యాయమూర్తి విడుదల చేశారు. బెయిల్ పై విడుదలైన కొల్లు రవీంద్రకు ఘన టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

అంతకముందు మాజీ మంత్రి కొల్లు అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడారు. అక్రమ కేసులు, తప్పుడు సెక్షన్ లు పెట్టి కొల్లును అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. టీడీపీ బీసీ నేతల గొంతు నొక్కడంలో భాగం గానే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. పోలీసు చర్య ను గట్టిగా ప్రశ్నించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.