AP High Court : పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్

ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

AP High Court : పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్

Ap High Court

AP Gazetted Officers‌ JAC petition : ఏపీలో పీఆర్సీ పంచాయితీ హైకోర్టుకు చేరింది. సర్వీస్‌ బెనిఫిట్స్‌ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్‌ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. విభజన చట్ట ప్రకారం ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్‌ బ్రేక్‌ టైమ్‌లో ధర్నా చేపట్టారు. మూడవ బ్లాక్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెక్రటేరియట్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని.. తమకు న్యాయమైన హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలతో కూడిన జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళనలు విరమించబోమంటున్నారు.

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఓ పక్క తమ ఆందోళనలు పట్టించుకోకుండా.. హడావుడిగా కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడతామంటున్నారు.

ఏపీలో ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగానే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది. ఇక- కొత్త జీతాలు వద్దు.. పాతవే కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.

Corona Control : తెలంగాణలో కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కిట్ పంపిణీ

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సర్కార్‌ చర్యలు సరైనవి కాదన్నారు ఏపీ ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాస్. కొత్త పీఆర్సీతో జీతాలు వద్దని చెబుతున్నా వినకుండా.. ప్రభుత్వం ఆదేశాలివ్వడం ఉద్యోగుల్ని రెచ్చగొట్టడమే అన్నారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు.