AP Govt : పదో తరగతిలో గ్రేడ్స్ లేవ్, గ్రేడ్ పాయింట్లు లేవ్…పాత పద్ధతే

పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.

AP Govt : పదో తరగతిలో గ్రేడ్స్ లేవ్, గ్రేడ్ పాయింట్లు లేవ్…పాత పద్ధతే

Jagan

AP 10th Class: విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తున్న ఏపీ సర్కార్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి… తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Read More : Cobra bites Chef : కోబ్రా పగ..ముక్కలు ముక్కలుగా కోసినా..కాటేసి చంపేదాకా వదల్లేదు..!!

2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని.. ఆ ఒత్తిడిని తగ్గించేందుకే గ్రేడింగ్‌ ను రద్దు చేస్తున్నామంటున్నారు అధికారులు. ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినపుడు… ఉన్నత చదువుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు, నియామకాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని.. దానిని నివారించేందుకే గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వనున్నారు.

Read More : Hotstar: హాట్‌స్టార్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు.. ట్విట్టర్‌లో ట్రెండింగ్!

కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేయడంతో… ఇంటర్ ప్రవేశాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉందని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానాన్ని రద్దుచేసి.. మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. 2020 మార్చి నుంచి ఈ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. 2019 మార్చి విద్యార్థులకు మాత్రం గ్రేడింగ్ విధానాన్నే అమలు చేయనున్నారు.

Read More : Pilligudiselu : 288 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభోత్సవం

ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానాన్ని రద్దుచేసి మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది.