AP PRC : ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నేటి నుంచే సమ్మె- ఉద్యోగ సంఘాల వార్నింగ్

జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన సర్కులర్ పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఉద్యోగులపై తీసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి జరగాల్సిన సమ్మెని..

AP PRC : ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నేటి నుంచే సమ్మె- ఉద్యోగ సంఘాల వార్నింగ్

Ap Prc Warning

AP PRC : జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ట్రెజరీ ఉద్యోగుల ఆర్థిక శాఖ జారీ చేసిన సర్కులర్ పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి జరగాల్సిన సమ్మెని ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చలు, సర్కులర్ పై పీఆర్సీ సాధన సమితి చర్చించింది. తాము వద్దంటున్నా జనవరి నెల జీతం వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

మరోవైపు ఉద్యోగ సంఘాల తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు పెట్టి ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు సజ్జల. కొన్ని చోట్ల ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ ఆపడం క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని చెప్పి.. ఇప్పటినుంచే సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు.

ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తామన్నారు. సమస్యను తెగేదాకా లాగడం సరికాదన్నారు. ఇవాళ చర్చలకు వస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు ఎందుకు రాలేదని సజ్జల ప్రశ్నించారు. పర్సనల్ గా ఫోన్ చేసినా చర్చలకు రాకపోవడం దురదృష్టకరం అని వాపోయారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని సజ్జల హెచ్చరించారు. మమ్మల్ని మీరైనా ఒప్పించండి.. లేదా.. మిమ్మల్ని మేమైనా ఒప్పిస్తాం అన్నారు. చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సజ్జల స్పష్టం చేశారు.

Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?