శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్‌పై మంత్రుల అభ్యంతరం

  • Published By: madhu ,Published On : January 21, 2020 / 07:43 AM IST
శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్‌పై మంత్రుల అభ్యంతరం

ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ  రెండు బిల్లులు మండలిలో ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ అనూహ్యంగా టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది.

మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది. ఈ రూల్‌ను మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. రూల్ 71 కింద చర్చకు మండలి ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. ఎలా అనుమతినిస్తారంటూ.. ఏపీ మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 

మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్న తీరును ఏపీ మంత్రులు ఖండించారు. ఏపీ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించాలని మంత్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం శాసనమండలిలో జరుగుతున్న విధంగా వ్యవహరిస్తే..ప్రభుత్వమే నడవదని బుగ్గన వ్యాఖ్యానించారు. దీనికి టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మంత్రుల తీరుతో సిగ్గు పడాల్సి వస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. 

 

* శాసనమండలిలో అధికారపక్షానికి బలం తక్కువగా ఉంది. 
* ఈ బిల్లులను పాస్ చేయించుకోవడం అధికారపక్షానికి కత్తిమీద సాములా మారింది. 
* ఈ బిల్లులపై తమ అభిప్రాయాన్న వినిపించాలని టీడీపీ సభ్యులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 
 

* మండలిలో గట్టిగా వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 
* రాజధానుల బిల్లు చర్చకు వచ్చిన వేళ శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. 
* ఆ పార్టీకి చెందిన నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 

Read More : అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేశారు : బీజేపీ ఎంపీ జీవీఎల్