FactCheck : పోలీసులపై దాడి కాదు..వాస్తవం ఇదిగో – ఏపీ పోలీస్

FactCheck : పోలీసులపై దాడి కాదు..వాస్తవం ఇదిగో – ఏపీ పోలీస్

AP police clarity on ycp attack : వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ…ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చేసిన ట్వీట్‌ (Tweet)లో వాస్తవం లేదన్నారు విశాఖ పోలీసులు. అక్కడ జరిగిన విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) నేతలు నిర్వహించిన ర్యాలీలో..వారిని అడ్డుకొనే క్రమంలో..ఆటో తగిలి కిందపడిపోయానని ఈ సమయంలో నిరసన కారుడు రమేశ్ వచ్చి…తనకు సహాయం చేయడం జరిగిందని అరిలోవ సీఐ ఇమ్మాన్యూల్ రాజు వెల్లడించారు. రమేశ్ తనకు సహాయం చేయడాన్ని వక్రీకరిస్తూ…సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. నిరసన జరిగిన ఘటనపై ఓ వీడియోను విడుదల చేశారు.


ఈ సందర్భంగా సీఐ ఇమ్మాన్యూల్ రాజు మాట్లాడుతూ…నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్న వారిని టార్గెట్ చేసి వెనక్కి లాగుతాం..ఓ పర్సన్‌‌ని లాగే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో  తగిలి కిందపడిపోయామన్నారు. గ్రూపులో ఉన్న రమేశ్ అనే వ్యక్తి..వచ్చి తనను పైకి లేపి..తలకు గాయమైందా..అని చేయి పట్టి రఫ్ చేశాడని తెలిపారు. అయితే..దీనికి సంబంధించిన ఫొటోను తీసుకుని అనవసరంగా..పోలీసులపై దాడి చేశారంటూ..అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని, ఎవరు తప్పుచేసినా..చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ ఇమ్మాన్యూల్ రాజు తెలిపారు.