AP Covid Bulletin : ఏపీలో కొత్తగా 37 కరోనా కేసులు.. అనంత జిల్లాలో అత్యధికం..

ఏపీలో గడిచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో..

AP Covid Bulletin : ఏపీలో కొత్తగా 37 కరోనా కేసులు.. అనంత జిల్లాలో అత్యధికం..

Ap Corona

AP Covid Bulletin : ఏపీలో గడిచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 17 కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,04,031 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 506 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,730గా ఉంది. నేటివరకు రాష్ట్రంలో 3,33,39,780 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 580 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid Bulletin)

China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. రెండేళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు వరుసగా రెండో రోజూ 2వేల దిగువనే నమోదవ్వడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.84లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 0.40శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో మరో 2వేల 652 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74శాతానికి చేరింది.(AP Covid Bulletin)

ఇక 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 31 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు తగ్గడంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 25,106 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.06శాతానికి దిగొచ్చింది.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 2.97లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 181.24 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ వయసు వారిలో 17.99 లక్షల మంది తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!

కరోనా తీవ్రత తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ బుసలు కొడుతోంది వైరస్. పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో పంజా విసురుతోంది. కోవిడ్ ఫోర్త్ వేవ్ హెచ్చరికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కరోనా కారణంగా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణను ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్‌ వంటివి తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.