Covid-19 : ఏపీలో కొత్తగా 8,766 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

Covid-19 : ఏపీలో కొత్తగా 8,766 కరోనా కేసులు

Covid 19 In Ap

Covid-19 : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు. గత 24 గంటల్లో 67 మంది కోవిడ్ వల్ల మరణించారని… కోవిడ్ పాజిటివిటీ రేటు 9.37 శాతం వుందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇంతవరకు 17 లక్షల 79 వేలు 773 మంది కోవిడ్ కు గురైనట్లు టెస్టుల ద్వారా గుర్తించామన్నారు. 16 లక్షల 64 వేల 82 మంది కోవిడ్ కు చికిత్స పొందగా …. 11,696 మంది కోవిడ్ వల్ల మరణించారని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,00,39 764 శాంపిల్ టెస్టులు చేశారు.

కరోనా టెస్టులు  చేయటంలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్ధానంలో ఉందని ఆయన  చెప్పారు.  వివిధ జిల్లాలకు 497 టన్నుల ఆక్సిజన్ పంపించామన్నారు. ఇంత వరకు జరిపిన ఫీవర్ సర్వేలో 33,262 కోవిడ్ కేసులు ఉన్నట్లు రిపోర్టు వచ్చాయి.  రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇవ్వగా 21,05,630 వ్యాక్సిన్ డోసులు  వచ్చాయని.. మరో 16,54, 730 డోసులు రావాల్సి వుందని సింఘాల్ తెలిపారు. జూన్ చివరినాటికి 5 ఏళ్ల లోపు వయసున్న   చిన్నారుల తల్లులకు   వ్యాక్సిన్  వేయటం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.