Andhra pradesh : కడప జిల్లా గవ్వల చెరువులో మూడు మృతదేహాల కలకలం

కడప జిల్లాలోని రాయచోటి మండలంలోని ఓ చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపాయి. గువ్వల చెరువలో ఓ పురుషుడు..రెండు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు.

Andhra pradesh : కడప జిల్లా గవ్వల చెరువులో మూడు మృతదేహాల కలకలం

three dead bodies found in kadapa district : కడప జిల్లాలోని రాయచోటి మండలంలోని ఓ చెరువులో మూడు మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. గువ్వల చెరువలో ఓ పురుషుడు..రెండు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.ఆ మృతదేహాలు ఎవరివి? ఎవరన్నా హత్య చేసి ఇక్కడ పారేశారా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చెరువులో మృతదేహాలను చూసి స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాయచోటి మండలంలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యం కావడం గ్రామంలో కలకలం రేపుతుంది. వీరు వారం రోజుల క్రితం మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎవరో ఎక్కడో వీరిని చంపి గవ్వల చెరువులో పారేసినట్లుగా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.వీరిది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.