Supreme Court : మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన తెలుగురాష్ట్రాల ఆస్తుల విభజన

మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court : మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన తెలుగురాష్ట్రాల ఆస్తుల విభజన

Telugu States properties

Telugu States Properties News: మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహా సంబంధం ఉన్న ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సబ్ కమిటీని సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే.

Also read : BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాల మధ్య ఖనిజాభివృద్ధి సంస్థ ఆస్తులు, అప్పుల విభజన కేసులో కేంద్ర ప్రభుత్వం, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు (ఏపీఎండీసీ) సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ విభజనపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఫిబ్రవరి 21,2022) విచారణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఎండీసీ తరపున సీనియర్‌ న్యాయవాది సి.ఎస్‌.వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ… రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ సమాఖ్య విభజనపై తాము గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తుత పిటిషన్‌కు జత చేయాలని కోరారు.

Also read : Hijab Row : హిజాబ్ వివాదంపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..!

న్యాయవాది వైద్యనాథన్‌ వాదనపై ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది పరాగ్‌ పి.త్రిపాఠి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖనిజాభివృద్ధి సంస్థ విభజనకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. విభజనకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయనే త్రిపాఠి వాదనతో వైద్యనాథన్‌ అంగీకరించలేదు. ఇది వాస్తవం కాదంటూ త్రిపాఠీ వాదనతో విభేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసింది. డెయిరీ సమాఖ్య రికార్డులను తమకు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.