AP : బద్వేల్ ఉప ఎన్నిక..నోటిఫికేషన్

ఏపీలోని.. బద్వేల్‌ ఉప ఎన్నికకు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.

AP : బద్వేల్ ఉప ఎన్నిక..నోటిఫికేషన్

Badvel

Badvel By Election : ఏపీలోని.. బద్వేల్‌ ఉప ఎన్నికకు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా సబ్-కలెక్టర్ కెథన్ కార్గ్ ను నియమించింది ఈసీ. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.

Read More : T.Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?

బద్వేలు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 16 వేల 139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1 లక్షా 7 వేల 340 మంది మహిళా ఓటర్లు, లక్షా 8 వేల 799 మంది పురుషులు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. బద్వేల్‌ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు జిల్లా అధికాకారులు. కొవిడ్ నిబంధనలు ఉండటంతో.. బహిరంగ సభకు వెయ్యి మందికి అనుమతించబోమంటున్నారు ఎన్నికల అధికారులు.

Read More : Dengue Vaccine : డెంగ్యూ వ్యాక్సిన్‌ కోసం విస్తృతంగా ట్ర‌య‌ల్స్ : డా.బ‌ల్‌రామ్ భార్గ‌వ్ 

ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాలని.. కేవలం ఐదుగురితో ప్రచారం నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది, అధికారులు, ఏజెంట్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు అధికారులు.