Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక..ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను అడ్డుకున్న స్థానికులు | Badvel by-election, Tension in S.Venkatapuram

Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక..ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను అడ్డుకున్న స్థానికులు

కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్‌.వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను స్థానికులు అడ్డుకున్నారు.

Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక..ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను అడ్డుకున్న స్థానికులు

Tension in S.Venkatapuram : కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్‌.వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటేసేందుకు ఎస్‌.వెంకటాపురం పోలింగ్ కేంద్రానికి కొంతమంది స్థానికేతరులు వచ్చారంటూ వారిని.. స్థానికులు నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు దాడికి ప్రయత్నించడంతో కాసేపు టెన్షన్ నెలకొంది. స్థానికేతరులకు స్థానికులు చెప్పులు చూపించడంతో మరింత గొడవ జరిగింది. వెంటనే పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఇరు వర్గాలను విడదీశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది.

బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ కూడా రాత్రి 7గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెల్లడవుతాయి. గతంలో కంటే అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. 2019లో 77.64శాతం ఓటింగ్ నమోదైతే.. ఈసారి 100శాతం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

Badvel by-election: బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ప్రధాన అభ్యర్థులు వీరే!?

బద్వేల్‌లో మొత్తం 281 పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ జరుగుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ.. లైవ్ వెబ్‌ టెలికాస్టింగ్‌ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. బద్వేల్‌ బై పోల్‌ లో మొత్తం 11 వందల 24 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బ‌ద్వేల్ ఎన్నిక‌ల కోసం 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్, అదనపు బలగాలు మాత్రమే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు.

బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. వీటిలో బద్వేల్, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు మండలాలు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 15 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 7 వేల 915 మంది పురుషులు ఉండగా.. లక్షా 7 వేల 355 మంది మహిళలు.. 22 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు.

Huzurabad By Election : నన్ను పోలింగ్ కేంద్రానికి వెళ్లొద్దు అనటానికి బీజేపీ నేతలు ఎవరు : కౌశిక్ రెడ్డి

బద్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా పోరుమామిళ్ల మండలంలో 48 వేల 21 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గోపవరం మండలంలో 44 వేల 493 మంది, మూడోస్థానంలో బద్వేల్‌ మండలంలో 40 వేల 735 మంది ఓటర్లు ఉన్నారు.

 

×