వైసీపీది అప్పుడొకమాట..ఇప్పుడొకమాట : విద్యా వ్యవస్థపై చర్చిద్దామా బోండా ఉమ సవాల్

  • Published By: madhu ,Published On : November 22, 2019 / 07:10 AM IST
వైసీపీది అప్పుడొకమాట..ఇప్పుడొకమాట : విద్యా వ్యవస్థపై చర్చిద్దామా బోండా ఉమ సవాల్

విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో చర్చించాలని, చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని టీడీపీ నేత బోండా ఉమా సవాల్ విసిరారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట..అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడకూడదన్నారు. విద్యా వ్యవస్థపై గతంలో వైసీపీ ఎలా వ్యవహరించింది..జగన్ వ్యాఖ్యలు తదితర వాటికి సంబంధించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

టీచింగ్ స్టాఫ్‌ను ముందుగా తీసుకొచ్చి పక్కాగా దీనిని అమలు చేయాలని సూచించారు. తమ ప్రభుత్వంలో ఉన్న సమయంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండేదన్న ఆయన..బీసీ, ఎస్సీ, మైనార్టీ కులాలు, పేదలు అత్యున్నతమైన స్థితిలో విదేశాల్లో ఉన్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సమయంలో బాబు ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున్న ప్రమోట్ చేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నాడు – నేడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, కానీ..వివిధ భవనాలకు వైసీపీ పార్టీ రంగులను వేస్తున్నారని విమర్శించారు. దీనికి నేడు – రేపు పేరు పెట్టుకోవాలని..ఇదొక బోగస్ ప్రోగ్రాం అని అభివర్ణించారు.

విద్యా వ్యవస్థలో తాము అనేక మార్పులు తీసుకొచ్చి పేదలకు అందించామన్నారు. విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉందని, 2016-17లో నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందన్నారు బోండా ఉమా.
Read More : పంపకాల విషయంలో భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు