YS Vivekananda Reddy : వివేకా హత్య కేసులో కీలక విషయాలు.. వాచ్‌‌మెన్ రంగయ్య సంచలన వాంగ్మూలం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిని విచారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్ మన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు.

YS Vivekananda Reddy : వివేకా హత్య కేసులో కీలక విషయాలు.. వాచ్‌‌మెన్ రంగయ్య సంచలన వాంగ్మూలం

Ys Vivekananda Reddy

YS Vivekananda Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. 44 రోజులుగా ఈ విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు సన్నిహితులు, హత్యకేసులో అనుమానం ఉన్నవారిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్‌‌మెన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు.

సెక్షన్ 164 ప్రకారం జమ్మలమడుగు న్యాయస్థానంలో వీరిని విచారించినట్లు అధికారులు తెలిపారు. వాచ్‌‌మెన్ రంగయ్య, డ్రైవర్ దస్తగిరి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రెండుగంటల పాటు వీరిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వివేకా హత్యకేసులో తొమ్మిది మందికి సంబంధం ఉన్నట్లు వాచ్‌‌మెన్ రంగయ్య చెప్పినట్లు తెలుస్తుంది. ఈ తొమ్మిది మంది వివరాలను కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది.

ఇక రంగయ్య స్టేట్మెంట్ ప్రకారం వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా గత మూడు రోజులుగా రంగయ్యను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు. తొమ్మిది మంది కలిసి ఈ హత్య చేసినట్లు రంగయ్య తెలిపారు.

ఈ హత్య కేసు విషయంలో సీబీఐ గత 44 రోజులుగా పలువురిని విచారించింది. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే గంగిరెడ్డితోపాటు, మరికొందరిని విచారించారు సీబీఐ అధికారులు. తాజాగా వాచ్‌‌మెన్ రంగయ్యను విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.