Kakinada Kendriya Vidyalaya Students: కాకినాడలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు అస్వస్థత.. జీజీహెచ్‌లో అత్యవసర చికిత్స

కాకినాడ కేంద్రీయ విద్యాలయంలోని 5, 6 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదంటూ స్కూల్లోనే కుప్పకూలిపోయారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Kakinada Kendriya Vidyalaya Students: కాకినాడలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు అస్వస్థత.. జీజీహెచ్‌లో అత్యవసర చికిత్స

Kakinada Kendriya Vidyalaya Students: కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులు మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 5,6 తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నట్లుండి ఊపిరాడటం లేదంటూ కుప్పకూలిపోయారు.

Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

దాదాపు 30 మంది విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురయ్యారు. గుండెల్లో మంటగా ఉందంటూ విద్యార్థులు రోదించారు. ఉదయం 9-10 గంటల మధ్య, స్కూల్లో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థుల్ని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో 30 మంది విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏదో కెమికల్ వాసన వచ్చిందని కొందరు విద్యార్థులు చెప్పారు. మరికొందరు మాత్రం అలాంటి వాసనేదీ రాలేదన్నారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం మిస్టరీగా మారింది.

Uttar Pradesh Jail : ఉత్తర ప్రదేశ్‌ జైల్లో ఖైదీలకు ఎయిడ్స్… ఒకేసారి 26 మందికి

కేంద్రీయ విద్యాలయం సమీపంలో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీంతో ఇక్కడి పరిశ్రమల నుంచి విష వాయువులు లీకై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటన విషయం తెలియడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.