Chandrababu Naidu Birthday: 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు.. ఘనంగా వేడుకలు!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా..

Chandrababu Naidu Birthday: 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు.. ఘనంగా వేడుకలు!

Chandrababu Naidu Birthday

Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.

Chandrababu Naidu : కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలి

రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు సవాళ్ళను ఎదుర్కొన్న ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన తన 73వ అడుగుపెట్టనున్న సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Chandrababu Naidu : అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు

నిరాడంభరంగా పార్టీ కార్యాలయంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొనున్న చంద్రబాబు.. బుధవారం పుట్టినరోజు నాడు నేతలతో, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు. నేటి నుంచి ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచించుకున్న చంద్రబాబు.. ఈరోజు నుండే అది అమలు చేయనున్నారు.

Chandrababu Naidu : ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది

పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న చంద్రబాబు.. పార్టీ కేంద్ర కార్యాలయoలో నాయకులు, కార్యకర్తల్ని కలవనున్నారు. సాయంత్రం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలం గొల్లగూడెంలో పర్యటించి.. గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఊరిలో గ్రామ సభ నిర్వహించి.. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.

Chandrababu Naidu : భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి

మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలకు ప్రణాళికలు రచించుకున్న చంద్రబాబు.. పార్టీ నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని మే మొదటి వారంలో కుప్పంలో చేపట్టనున్నారు. అదే నెలలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు.. మహానాడు తర్వాత ప్రతి 15 రోజులకి ఒక్క జిల్లాలో పర్యటించేలా, ప్రతి నెలా రెండు జిల్లాలు చొప్పున ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.