Chandrababu : మూడు జనవరిలు పోయాయి, ఇంకా జాబ్ క్యాలెండర్ లేదు-చంద్రబాబు
ఓ పక్క కరోనా, మరోపక్క జగన్ వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇదివరకు ఏపీని ఆదర్శంగా తీసుకునే వారని, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలను ఆదర్శంగా..

Chandrababu
Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం మండల గరికచీనే పల్లిలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో జరిగింది. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఓ పక్క కరోనా, మరోపక్క జగన్ వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇదివరకు ఏపీని ఆదర్శంగా తీసుకునే వారని, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.
Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల
మొన్న రామకుప్పంలో ఉద్దేశపూర్వకంగా గొడవ చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఉన్నచోట ఉయ్యాలవాడ విగ్రహం పెట్టాలని చూశారని, పోలీసులు దగ్గరుండి ఈ పని చేయించడం దారుణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు అంబేద్కర్ ను కించపరిచేలా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. అంబేద్కర్ వల్ల మనకు ఏమీ దక్కలేదని వైసీపీ మహిళా నేత వ్యాఖ్యానించడం చూశామన్నారు చంద్రబాబు.
Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా..
కుప్పంలో తన పర్యటనను అడ్డుకోవాలని చూశారని, సభకు వెళ్లొద్దని వాలంటీర్ల ద్వారా బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీలో జేబులు కొట్టే వాళ్ళున్నారని అన్నారు. ఇప్పటికే మూడు జనవరిలు ముగిశాయని, ఇంకా జాబ్ క్యాలెండర్ లేదని చంద్రబాబు విమర్శించారు.