Chandrababu : పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? మరీ ఇంత అరాచకమా? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.

Chandrababu : పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? మరీ ఇంత అరాచకమా? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu : ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీతో పొత్తు ఉన్నా కలిసి బలంగా పని చేయలేకపోతున్నా, వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం, ఆ కాసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ తో భేటీ కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. జనసేనాని పవన్ బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీతో కలిసి పని చేయబోతున్నారా? అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్ గంటసేపు ఏకాంతంగా సమావేశం అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా వీరి మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు సహా కీలక అంశాలపై డిస్కస్ చేశారు.

భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 8ఏళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కలిసికట్టుగా మీడియా ముందుకు వచ్చారు. పవన్ విషయంలో ప్రభుత్వం తీరు తనకు బాధ కలిగించిందన్నారు చంద్రబాబు. విశాఖలో పవన్ విషయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు ఎంత అరాచకం చేయాలో అంతా చేశారని అన్నారు. పవన్ ను నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎయిర్ పోర్టుకి వచ్చినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు అనేక ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకే తాను నోవాటెల్ హోటల్ కు వచ్చానని చంద్రబాబు వెల్లడించారు.

పవన్ వైజాగ్ లో ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలు ఉండలేవు. పార్టీలు లేకపోతే ప్రజా సమస్యలపై మాట్లాడేదెవరు? అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అంతా ఆలోచన చేయాల్సిన సమయం ఇది. అంతా ఏకం కావాలి. అందరి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందరం కలుద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. ప్రభుత్వానికి ఎదురు మాట్లాడితే కేసులు పెడుతున్నారు. మా వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. నా మనసు బాధపడటంతోనే పవన్ కు సంఘీభావం తెలిపా. వైసీపీ లాంటి దారుణమైన పార్టీని నా జీవితంలో చూడలేదు” అని చంద్రబాబు అన్నారు.