కోవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష.. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు ఆదేశం

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 09:17 AM IST
కోవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష.. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు ఆదేశం

ఏపీలో కోవిడ్‌పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెష్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరు  కానున్నారు. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం ఆదేశించారు. 

104 వాహనాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 104 వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ చేయనున్నట్టు తెలిపారు. షుగర్, బీపీ లాంటి వాటికీ పరీక్షలు చేయాలని, వారికి అక్కడే మందులు అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్‌ చేయనున్నారు. 104 స్టాఫ్‌ తోపాటు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేయనున్నారు. ప్రతినెలలో ఒక రోజు తప్పనిసరిగా ఒక గ్రామానికి 104 వెళ్లాలని సూచించారు. 

ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. చేసే పరీక్షల్లో యాభైశాతం.. కంటైన్‌మెంట్‌ జోన్లలోనూ మిగిలిన యాభైశాతం పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. మిగిలిన చోట్ల చేయాల్సి ఉంది. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాల్సి ఉంటుంది. ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చేవారికి వారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలని అందులో సూచించారు. వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పరీక్షలు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే.. ఏంచేయాలన్నదానిపై ఇదివరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతంచేయాలని అధికారులను నిర్దేశించారు. 

లోకల్‌ ప్రోటోకాల్‌‌ను రూపొందించాలని, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్‌ఓపీని ఆ ఇంటికి తెలియజేయాల్సిందిగా తెలిపారు. అలాగే టెలిఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలన్నారు. వచ్చే 90 కోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించడం, పరీక్షలు చేయించడం చేయాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు.ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలన్నారు. కరోనా ఉన్నట్టుగా అనిపిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలని పలు సూచనలు చేశారు. అందులో ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచితే సరిపోతుందని తెలిపారు. 

సబ్‌ సెంటర్లు వచ్చిన తర్వాత ప్రతిగ్రామ స్థాయిలో కూడా వైద్య సేవలు అందుతాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌సెంటర్లను ప్లాన్‌ చేయాలి. అర్బన్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని తయారుచేయాల్సిందిగా సూచించారు. అర్బన్‌ ప్రాంతాల జనాభా ప్రాతిపదికిన, అవసరమైన ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలి. 

ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్, స్టాఫ్‌ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నీషియన్‌ తప్పనిసరిగా ఉండాలి. దీని పరిధిలో ఉన్న ఏఎన్‌ఓంలు, ఆశాలు కూడా యూహెచ్‌సీకి అటాచ్‌ అయి ఉంటారు. వర్షా కాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయి. సన్నద్ధంగా ఉండాలని సీఎం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌పై సీఎం ఆరా  తీస్తున్నారు.  కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవేర్‌నెస్, ప్రచారాన్ని బాగా హైలెట్‌చేయాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిపోర్టు చేసేలా ఉండాలని తెలిపారు. 

సమీప ప్రాంతాల్లో టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో  ఉంచాల్సిందిగా సూచించారు. శానిటేషన్‌పైన కూడా దృష్టిపెట్టాలన్నారు. ప్రజలకు అవగాహన కలింగించేలా హోర్డింగ్స్‌ పెట్టాలని తెలిపారు. 1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో 1.20 కోట్ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మిగతావాటి పంపిణీని పూర్తిచేయాల్సిందిగా సూచించారు. వీటి పంపిణీ పూర్తయ్యాక… ప్రతి మనిషి ఆరోగ్య వివరాలు.. ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

104, 108 కొత్త వాహనాలు జులై 1కి ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కిందకు కోవిడ్‌ను తొలిసారిగా తీసుకు వచ్చింది మనమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా నేపథ్యలో మనుషులకైనా, పశువులకైనా, ఆక్వారంగంలో వినియోగించే ఔషధాలకైనా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

Read: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ-ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన