CM Jagan : జగన్ వద్దకు గన్నవరం, బందరు పంచాయితీలు

వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.

CM Jagan : జగన్ వద్దకు గన్నవరం, బందరు పంచాయితీలు

Cm Jagan (1)

CM Jagan : వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కృష్ణా జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ భేటీ అయ్యారు. గన్నవరం, బందరు వివాదాలపై ఇరువురు నేతలూ చర్చించారు.

విషయం సీఎం జగన్ కు వివరించగా, రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. గన్నవరం వైసీపీ ఇంచార్జ్ వంశీ అని తేల్చి చెప్పిన సీఎం జగన్.. వంశీతో కలిసి పని చేయాలని దుట్టా వర్గానికి సూచించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గన్నవరం వైసీపీలో ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య పోరు మరింత ముదిరింది. వంశీని టార్గెట్ చేస్తూ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న ఆరోపణలు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.

గన్నవరం వైసీపీలో ఎమ్మెల్యే వంశీకీ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య పోరు ముదురుతోంది. ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో హోరాహోరీ తలపడుతున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు వంశీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు వంశీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో వంశీ యథేచ్చగా మట్టి తవ్వకాలు చేస్తూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న ఆరోపణలు వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ysrcp: గ‌న్న‌వరంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ ఆధిపత్య పోరు.. వ‌ల్ల‌భ‌నేని వంశీపై దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్య‌లు

ఇక గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకట్రావు అన్నారు. గన్నవరం పరిధిలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఉన్నప్పటికీ జగన్ తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యా తనకు తెలుసన్నారు. కాగా, చంద్రబాబునుగానీ, జగన్ నుగానీ తాను వ్యక్తిగతంగా తిట్టలేదని, తాను టీడీపీలోకి వెళుతున్నానన్న మాట అబద్ధమని చెప్పారు.

YCP Politics : ’యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వంశీ‘ గన్నవరం టికెట్ పై మాటల తూటాలు

కాగా, ఆ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మద్దతు తనకే ఉందన్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవారి గురించి తాను అస్సలు పట్టించుకోనన్నారు. ఎవరికి సీటివ్వాలో జగన్ నిర్ణయిస్తారన్నారు. జగన్ పనిచేయాలని సూచించారని, తాను చేస్తున్నానని చెప్పారు. మిగతా వారి గురంచి పార్టీనే చూసుకుంటుందన్నారు.

తాను గెలిచినా ఓడినా గన్నవరంలోనే ఉన్నానని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు, వైసీపీలో ఉన్నా టీడీపీ వాళ్లూ తన సాయం పొందారని పేర్కొన్నారు. తాను 15 సినిమాలు తీశానని, ఆ సినిమాల్లో ఆయన లాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయని అన్నారు. తాను విలన్ అయితే.. ఆయనేమో మహేశ్ బాబా? అంటూ ఎద్దేవా చేశారు.

కాగా, మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వంశీ విమర్శించారు. గన్నవరంలోని మట్టిని కుప్పం వరకు ఎలా తరలిస్తామని ప్రశ్నించారు. ఆ మట్టిని అక్కడిదాకా తరలించేందుకు.. ఆ మట్టికన్నా ఎక్కువగా డీజిల్ కే ఖర్చవుతుందని చెప్పారు. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందన్నారు.