CM YS Jagan Aerial Survey: వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

CM YS Jagan Aerial Survey: వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Ys Jagan Aerial Survey

CM YS Jagan Aerial Survey :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌  మోహన్ రెడ్డి ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల వంతున సాయం అందించాలన్నారు.

Also Read : Building Collapsed : కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం-ఇద్దరు చిన్నారుల మృతి

ఇటు వరద పరిస్థితులపై ప్రధాని మోదీ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.