Roja Selvamani : దమ్ము, ధైర్యం ఉంటే.. 34మందిని సొంతంగా నిలబెట్టు- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సవాల్

Roja Selvamani : లోకేశ్, పవన్ మొదట ఎమ్మెల్యేలుగా గెలవాలి. సొంత జిల్లాకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదు.

Roja Selvamani : దమ్ము, ధైర్యం ఉంటే.. 34మందిని సొంతంగా నిలబెట్టు- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సవాల్

Roja Selvamani

Roja Selvamani – Pawan Kalyan : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా సీన్ లోకి వచ్చారు. పవన్ కల్యాణ్, లోకేశ్, చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరిగారు రోజా. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు రోజా.

పవన్ మళ్లీ ఓడిపోతారు:
” పవన్ కల్యాణ్ మళ్లీ ఎమ్మెల్యే కూడా కాలేరు. గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు గెలవడం కాదు దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ నిలబెట్టాలి. లోకేశ్, పవన్ మొదట ఎమ్మెల్యేలుగా గెలవాలి. సొంత జిల్లాకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదు. ఓ మహిళకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించడం శుభపరిణామం. తన నాన్న స్థాపించిన పార్టీ పగ్గాలు చేపట్టలేకపోయినా చివరకు బీజేపీ పగ్గాలు ఆమె అందుకుంటోంది” అని రోజా అన్నారు.(Roja Selvamani)

రూ.58 కోట్లతో ఆడుదాం ఆంధ్ర..
”ఏపీలో కనీవినీ ఎరుగని రీతిలో క్రీడా సంబరాలు జరగనున్నాయి. గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడలు ప్రారంభం కానున్నాయి. క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, కోకో, వాలీబాల్ మొత్తం ఐదు క్రీడల్లో పోటీలు ఉంటాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దశల వారీగా పోటీలు జరుగుతాయి. రూ.58.94 కోట్లతో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. 46 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం. క్రీడా రంగంలో కొత్త పాలసీ తీసుకొస్తున్నాము. అత్యున్నత ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం రద్దు చేశాము. వివిధ రకాలుగా వారికి ప్రోత్సాహాకాలు ఉంటాయి తప్ప ఇకపై గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం జరగదు” అని మంత్రి రోజా చెప్పారు.

Also Read..MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే..
”మళ్లీ హిస్టరీ రిపీట్ అవుతుంది. పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లను కైవసం చేసుకుంటా అని ఊగిపోతున్నారు. 34 నియోజకవర్గాల్లో వైసీపీ రాకుండా చేస్తానని ఆవేశంగా ఉంటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 34 సీట్లలో మీరు సొంతంగా అభ్యర్థులను నిలబెట్టండి. అప్పుడు చూద్దాం. ఊరికే వచ్చి ఊగిపోవడం కాదు. తిరుపతిలో జాతరలు చూసే ఉంటారు. అలాగే ఉంది పవన్ వైఖరి. ఊగిపోతారు ఆ తర్వాత వెళ్లిపోతారు.(Roja Selvamani)

Also Read.. Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి

లోకేశ్, పవన్ ముందుగా ఎమ్మెల్యేగా గెలవండి..
కానీ, పాలిటిక్స్ అలా కాదు. ఓపిక ఉండాలి. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టే ఆరోజు వైఎస్ఆర్, ఇవాళ జగన్.. చరిత్రలో ఎవరూ చేయని విధంగా గొప్ప చారిత్రక నిర్ణయాలతో, పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు. కాబట్టే ప్రజలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి. ఊరికే ఎగరటం వల్ల ఎవరూ పట్టించుకోరు. లోకేశే కాదు పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలవరని అర్థమైపోయింది. అటు లోకేశ్, ఇటు పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నించండి” అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

అందరికీ గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేము:
”రెగులర్ గా ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో 2శాతం జాబ్స్ అది వస్తుంది. కానీ, చంద్రబాబు నాయుడు ఒక చెడ్డ సంప్రదాయం తీసుకొచ్చారు. అందరికీ గ్రూప్ 1 పోస్టులు ఇవ్వాలని. ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో తెలీదు. లేనిది తీసుకొచ్చి అనౌన్స్ చేసేసి ఆయన పాటికి ఆయన వెళ్లిపోయారు. దాని వల్ల ఇబ్బంది పడకూడదని ఇద్దరు ముగ్గురికి పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ, అలా అందరికీ గ్రూప్ 1 పోస్టులు ఇచ్చుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో పరిపాలనలో ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి అకాడెమీలు పెట్టుకోవడానికి ల్యాండ్, వాళ్లకు వచ్చే మెడల్స్ ను బట్టి ఇన్సెంటివ్స్ ఎన్ని లక్షలైనా ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక సహకారం అందిస్తున్నాం. స్పోర్ట్స్ కోటా 2శాతం ఉందో అందులో జాబ్స్ ఉంటాయి” అని మంత్రి రోజా అన్నారు.