Devotees Increased In Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

devotees in Tirumala
Devotees Increased In Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు దాదాపు 6 కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉన్నారు.
Srivari Brahmotsavam In Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 72,195 మంది భక్తులు దర్శించుకోగా 41,071 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.