Rain In Tirupati : జలదిగ్బంధంలో తిరుపతి.. స్తంభించిన జనజీవనం.. నిలిచిన రాకపోకలు

భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.

Rain In Tirupati : జలదిగ్బంధంలో తిరుపతి.. స్తంభించిన జనజీవనం.. నిలిచిన రాకపోకలు

Tpt Rain

Cyclone In The Bay Of Bengal : వర్షానికి తిరుమల చిగురుటాకులా వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా తిరుపతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి బస్టాండు మొత్తం నీరు నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులు అంతంత మాత్రమే నడుస్తున్నాయి.

Read More : Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవ్వరు బయటకి రావొద్దని అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు సూచించారు. భారీ వర్షాలు కురుస్తూండడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకి రాకుండా ఉండడమే బెటర్ అని సూచిస్తున్నారు. భారీ వర్షాలతో తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. సహాయకచర్యలు అందించేందుకు స్పెషల్ పార్టీ పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

Read More : Chittoor Rains : ఇంటి నుంచి బయటకు రావొద్దు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాయుగుండం 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుందని, చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిస్తున్నారు. హరిణి సమీపంలో రెండో ఘాట్‌రోడ్డులో కొండ చరియలు జారిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.