Doctors Negligence : మహిళ చేతికి కట్టు వేసి అందులో సర్జికల్ బ్లేడ్ ను మర్చిపోయిన డాక్టర్లు

డ్రెస్సింగ్ కూడా ఆలస్యంగా చేయడంతో ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు చేతిని తీసేయాలని వైద్యులు అంటుండడంతో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Doctors Negligence : మహిళ చేతికి కట్టు వేసి అందులో సర్జికల్ బ్లేడ్ ను మర్చిపోయిన డాక్టర్లు

Doctors Negligence

Doctors Negligence : విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చేతికి పురుగు కరిచిందని ఆసుపత్రికి వెళ్తే ఇప్పుడు చేతినే తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తిరువూరు నియోజకవర్గంలో ఓ మహిళ చేతికి పురుగు కరవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. అయితే మహిళకు డాక్టర్లు చికిత్స చేశారు. మహిళ చేతికి కట్టు వేశారు. కానీ, అందులో సర్జికల్ బ్లేడ్ ను మర్చిపోయి డాక్టర్లు చేతికి కట్టు వేశారు. దీంతో చేతికి మరింత ఇన్ఫెక్షన్ సోకింది. డ్రెస్సింగ్ కూడా ఆలస్యంగా చేయడంతో ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు చేతిని తీసేయాలని వైద్యులు అంటుండడంతో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందిన నందిపాం సురేశ్ భార్య తులసి(22) తన ఉన్న పూరిల్లు సర్దుకునే క్రమంలో ఓ పరుగు కరిచింది. దీంతో ఆమె స్థానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తర్వాత నూజివీడు డాక్టర్లు పరిశీలించి ఇన్ఫెక్షన్ సోకిందని మెరుగైన వైద్యం కోసం విజయవాడ కొత్త ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ ను తొలగించి కట్టు కట్టారు.

Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి

అయితే అందులో సర్జరీ కోసం ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్ మరిచిపోయి కుట్టు వేశారు. దీంతో చేతికి పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో డాక్టర్లు చేతి తీసేయాలని చెప్పడంతో మహిళ పరిస్థితి అయోమయంగా మారింది. చిన్న గాయంతో ఆస్పత్రికి వస్తే పూర్తిగా తన చేతినే తొలగిస్తామని చెప్పడంతో తులసి, ఆమె కుటుంబ సభ్యులు ఏం చేయాలో తోచక దిక్కు లేని స్థితిలో ఉన్నారు.

భార్యాభర్తలు ఇద్దరు కూలీ పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటే కానీ, కుటుంబం గడవని పరిస్థితి. దీంతో వారు బాధ వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందించి చేయి తీయకుండా ఉండేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.