Ayyanna Patrudu : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. లోకాయుక్తకు ఆధారాలు ఇచ్చిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu : 100 మంది వైసీపీ నాయకులు 15 ట్రాక్టర్లు పెట్టి తెల్లవార్లు రంగు రాళ్లను తవ్వేసి తరలించారు.

Ayyanna Patrudu : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. లోకాయుక్తకు ఆధారాలు ఇచ్చిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu (Photo : Google)

Ayyanna Patrudu – Lokayukta : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు లోకాయుక్తను కలిశారు. రంగురాళ్ల తవ్వకాలపై ఆయన లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను వారికి అందజేశారు. అనకాపల్లి జిల్లా వెలుగొండ మండలం సాలికమల్లవరం గ్రామం సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఏప్రిల్ 12న రాత్రి కొంతమంది వైసీపీ నేతలు రంగురాళ్లు తవ్వేశారని ఆయన ఆరోపించారు. రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ లో దేన్నీ ముట్టుకోకూడదనే నిబంధనలు ఉన్నాయని అయ్యన్న చెప్పారు.

”లోకాయుక్తకు రంగురాళ్ల తవ్వకాలపై ఎవిడెన్స్ అందజేశాను. లోకాయుక్తలో ఆధారాలు సబ్మిట్ చేశాను. లోకాయుక్త కేసు రిజిస్టర్ చెయ్యడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో జరిగిన రంగురాళ్ల తవ్వకాలపై లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాను. రిజర్వ్ ఫారెస్ట్ లో కొంతమంది వైసీపీ నాయకులు ప్రొక్లైనర్ తో ఖరీదైన రంగురాళ్లు తవ్వేశారు.

Also Read..AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్

100 మంది వైసీపీ నాయకులు 15 ట్రాక్టర్లు పెట్టి తెల్లవార్లు రంగు రాళ్లను తవ్వేసి తరలించారు. ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ అధికారులకు అందరికీ ఫిర్యాదు చేశాం. స్పందనే లేదు. ఓ నిరుద్యోగిని సస్పెండ్ చేశారు తప్ప దానిపైన విచారణ చేయలేదు. రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమతులు లేకుండా రంగురాళ్ల తవ్వకాలు చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను తవ్వుకున్న గూండాలపై విచారణ
చేసి యాక్షన్ తీసుకోవాలి” అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.