BRS In Andhra Pradesh : ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు

ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్‌కు మద్దతుగా వెలసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో గులాబీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఏర్పడిన ఫ్లెక్సీలు కేసేీఆర్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్నాయి.

BRS In Andhra Pradesh : ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు

 BRS In Andhra Pradesh

BRS In Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా పోటీ చేస్తుందని..ఏపీలో కూడా పోటీ చేస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు. మరి ఏపీలో గులాబీ దళానికి మద్దతు లభిస్తుందా? ఏపీలో గులాబీ పార్టీకి అంత సీన్ ఉందా?కనీసం ఒక్క అభ్యర్థినైనా బీఆర్ఎస్ తరపును పోటీ చేయించగలదా? అనే అనేక ప్రశ్నలు వస్తున్న క్రమంలో అవును బీఆర్ఎస్ ఏపీలో పోటీకి రెడీగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ సంకేతాలు గులాబీ దళం నుంచి కాదు ఏకంగా ఏపీనుంచే వస్తున్నాయి. దానికి ఉదాహరణగా ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం కేసీఆర్ కు మద్ధతుగా వెలసిన ఫ్లెక్సీలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీఆర్ఎస్ కు మద్దతుగా…జై కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ కు ఏపీలో కూడా మద్దతు లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవు అమ్మాజీరావు పేరుతో అమలాపురంలో ఫ్లెక్సీలు వెలిసాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటనపై ఏపీలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిఫై ఏపీ టీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీలో BRS అడుగులు పడబోతున్నాయని, రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు లక్ష్యంగా అడుగులు పడబోతున్నాయని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ భారత రాష్ట్రీయ సమితి (BRS) అని సీఎం కేసీఆర్ ప్రకటనపై ఏపీలో కూడా హర్షం వ్యక్తం అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పై కూడా ప్రత్యేక ఫోకస్ చేసినట్టు చర్చ జరుగుతోంది. దీంట్లో భాగంగా సంక్రాంతికి భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇక్కడ బీఆర్ఎస్‌ కు ఆదరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. చాలామంది నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, నేతలతో పరిచయాలు ఉన్న కొందరు నేతలు.. ఏపీలో కేసీఆర్ ప్లాన్ పై ఆరా తీస్తున్నారని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏపీలో పార్టీని విస్తరించడంలో భాగంగా..వచ్చే సంక్రాంతి నాటికి విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం.

CM KCR BRS : ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది .. ప్రభంజనం సృష్టిస్తుంది : మంత్రి అజయ్ కుమార్

ముఖ్యంగా గతంలో రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండి.. ప్రస్తుతం యాక్టివ్ గా లేని నేతలను బీఆర్ఎస్ సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. టీఆర్ఎస్ నేతలతో గతంలో కలిసి పని చేసిన కొందరు తెలుగు దేశం నేతలతో కూడా మాట్లాడే అవాకశాలు ఉన్నాయి. బీజేపీలో ఉన్న కొందరు నేతలు కూడా బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి బీఆర్ఎస్ గులాబీ నేతల అంచనాలను రీచ్ అవుతుందా? ఏపీలో గులాబీ పార్టీ జెండా పాతేస్తుందా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.