Four Employees Suspend : ఏపీ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.

Four Employees Suspend : ఏపీ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులు సస్పెండ్

suspend

Four Employees Suspend : ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. కమిటీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చిన కమిషన్ గిరిజా శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీఎస్టీ విభాగంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రసాద్, మెహర్ కుమార్, సంధ్య, గడ్డం ప్రసాద్ లను సస్పెండ్ చేశారు. ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు, బదిలీలపై ఇటీవల ఉద్యోగులు ఆందోళన చేశారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ బదిలీలపై ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు.

Notices Govt Employees Union : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

నిన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. సమస్యలపై ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై తమను సంప్రదించే ఇతర మార్గాలున్నా.. గవర్నర్ ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది. రోసా రూల్స్ ఉల్లంఘించినందుకు గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు రోసా రూల్స్ ఉల్లంఘించారని ప్రభుత్వం చెబుతోంది.