Road Accident : కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంటిముందు కూర్చున్నవారి పైకి నేషనల్ హైవేస్ కు చెందిన వాహానం  దూసుకు రావటంతో నలుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయప

Road Accident : కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Kadapa Road Accident

Road Accident : ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం జనావాసాల పైకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త తమ పిల్లల ఎదుటే మృత్యు ఒడికి చేరుకున్నారు. బంధువులతో కలిసి ఆనందంగా ఉంటున్న వారికి మృత్యువు పలకరించింది. తల్లి తండ్రి మృతి చెందగా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.  కడప జిల్లా మద్ది మడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు లో బొలెరో వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు  గాయపడ్డారు. కడప వైపు నుండి అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం మద్ది మడుగు వద్దకు రాగానే అదుపు తప్పి అక్కడే చెట్టు కింద ఆడుకుంటున్న విద్యార్థులపై దూసుకెళ్లింది.

వారిని తప్పించబోయి చెట్టు కింద మంచం పై కూర్చుని ఉన్న వ్యక్తులు పైకి బొలెరో వాహనం దూసుకెళ్లడంతో మంచం పై ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో లో గుర్రం కొండయ్య, అమ్ములు, దేవి, లక్ష్మీదేవి అనే నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో గుర్రం. కొండయ్య అమ్ములు భార్య భర్తలు.

మొదట బొలెరో వాహనం వీరి కుమారులైన ధనుష్,అబ్దుల్లా ను ఢీకొని అనంతరం మంచం పై కూర్చొని ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొంది. ఈ ప్రమాదంలో అనుష్ అబ్దుల్లా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రి మృత్యువాత పడడంతో పాటు ఇద్దరు కుమారులు కూడా తీవ్ర గాయాలు పాలు కావడం తో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read : Ukraine-Russia: యుక్రెయిన్ అధ్యక్షుడిని హతమార్చేందుకు 400 మంది కిరాయి సైనికులను పంపిన పుతిన్
కడప వైపు నుండి రాయచోటి కి వెళుతున్న నేషనల్ హైవే 40 కి చెందిన బొలెరో వాహనం మద్ది మడుగు వద్దకు రాగానే అదుపుతప్పి బాధితులను వ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బొలెరో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.