Andhra Pradesh : ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

Andhra Pradesh : ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్

Ap

Covid Vaccine : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 2021, ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్…ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారధిలకు సీఎం జగన్ ఫోన్ చేశారు. రాష్ట్ర అవసరాల కోసం మరిన్ని వ్యాక్సిన్ డోసుల సరఫరా చేయాలని కోరారు. రెమ్ డెసివర్ ఇంజెక్షన్లు కూడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే..18 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందచేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. మే 01వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిని కట్టడి చేస్తామని, ఆసుపత్రుల ఇష్యూలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సిటీ స్కాన్ సెంటర్లో దోపిడి జరిగితే..మాత్రం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల విషయంలో ఎక్కువగా వసూలు చేస్తే..చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బయటకు వచ్చిన సమయంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందన్నారు. శాశ్వతంగా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే..మొదటిది వ్యాక్సిన్ తో పాటు..ప్రజల సహకారం తప్పకుండా ఉండాలన్నారు మంత్రి ఆళ్ల నాని.
Read More : India : వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వలేమా ? ఇది అసలు లెక్క!