Guntur : గ్యాంగ్ వార్ లో తలలు పగలకొట్టుకున్న విద్యార్థులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య శనివారం కళాశాల వద్ద ఘర్షణ జరిగింది. చిన్న గొడవగా ప్రారంభమై కర్రలు బ్యాట్లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు.

Guntur : గ్యాంగ్ వార్ లో తలలు పగలకొట్టుకున్న విద్యార్థులు

Guntur

Guntur : గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య శనివారం కళాశాల వద్ద ఘర్షణ జరిగింది. చిన్న గొడవగా ప్రారంభమై కర్రలు బ్యాట్లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే..నలంద ఇంజనీరింగ్‌ కళాశాలలో గుంటూరుకు చెందిన నందేటి ప్రియతమ్‌ ఇంజనీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు, అదే కళాశాలలో ముప్పాళ్ల మండలం కుందూరివారి పాలెంనకు చెందిన సైకం గురు కార్తీకరెడ్డి ద్వితీయ సంవత్సరం చదువున్నాడు.

శనివారం కార్తీక్‌పై ప్రియతమ్‌ కామెంట్‌ చేశాడు. దీంతో కార్తీక్ తన స్నేహితులతో కలిసి కాలేజీ బయట ఉన్న ప్రియతమ్ పై దాడి చేశాడు. ఆ సాయంలో ప్రియతమ్ పక్కన అతడి సోదరుడు కూడా ఉన్నాడు. అన్నను కొడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియతమ్ సోదరుడిపై దాడి చేయడంతో అతడి తలకు బలమైన గాయమైంది. దీంతో ప్రియతమ్ గాయపడిన తన సోదరుడిని తీసుకోని కారులో సత్తెనపల్లి ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్తుండగా కార్తీక్ గ్యాంగ్ కారును అడ్డుకునే ప్రయత్నం చేసింది.

దీంతో ప్రియతమ్ కారును ఆపకుండా వేగంగా పోనిచ్చాడు దీంతో కార్తీక్ స్నేహితులు శ్రీను, శ్యాంసుందర్‌, గోపి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.