Vallabhaneni Vamsi : టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకుంటానా? వల్లభనేని వంశీ

టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్ముంటే రండి చూసుకుందాం అని చాలెంజ్ చేశారు వల్లభనేని వంశీ.

Vallabhaneni Vamsi : టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకుంటానా? వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi : టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్ముంటే రండి చూసుకుందాం అని చాలెంజ్ చేశారు వల్లభనేని వంశీ.

”ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో.. ఆ ఊరుకు ఈ ఊరు అంతే దూరం. టీడీపీ కుక్కలు తిడుతుంటే ఊరుకుంటామా? రమ్మనండి చూసుకుందాం. నేను గన్నవరంలో పార్టీ ఆఫీసులోనే ఉన్నా. విజయవాడలో ఎంతో మంది రౌడీలను చూశా. సంకల్ప సిద్దికి నాకు ఏం సంబంధం? వాళ్ల మొహం కూడా నేను ఇంతవరకు చూడలేదు. నాకు సంబంధం ఉందని ప్రచారం చేశారు. కోర్టులో పరువు నష్టం దావా వేశా. కొడాలి నానిని గడ్డం గ్యాంగ్ అని తిడుతున్నారు. నన్ను సైకో అంటారా? చేతనైతే నా మీద పోటీ చేసి నన్ను ఓడించండి” అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ.

Also Read..Andhra Pradesh Politics : అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవటంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

”తేల్చుకుందాం రా అని సవాల్ విసిరే అంత పౌరుష వంతులు, గొప్పోళ్లు ఎవరో నాకు తెలీదు. నేను విజయవాడ పార్లమెంటుకి పోటీ చేశాను. విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ సమయంలో బెజవాడలో ఉన్న అనేకమంది పిల్ల రౌడీలను, పెద్ద రౌడీలను, ఆకు రౌడీలను అందరినీ చూశా. నేను పార్టీ ఆఫీస్ లోనే ఉన్నా. వాళ్లని రమ్మనండి. నా నియోజకవర్గం గన్నవరంలో నా పని నేను చేసుకుంటున్నా. సంకల్ప సిద్ధికి నాకు ఏంటి సంబంధం? ఆ మనుషుల ముఖాలు కూడా చూడలేదు.(Vallabhaneni Vamsi)

వాళ్లు ఎవరో మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తే, వాళ్లు గన్నవరం వాళ్లని నన్ను లింకప్ చేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేను దానికి కూడా ఏమీ మాట్లాడకుండా కోర్టులో పరువు నష్టం దావా వేశాను. గన్నవరంలో కోర్టులో పట్టాభి మీద పరువు నష్టం దావా వేశా. అతడి దగ్గర ఆధారాలుంటే కోర్టుకి ఇవ్వొచ్చు కదా. వాళ్లు ప్రతి రోజూ తిడుతున్నారు.

Also Read..Andhra Pradesh : గుడివాడ గుట్కా నాని, పిల్లసైకో వల్లభనేని వంశీ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది : టీడీపీ నేత ఘాటు వార్నింగ్

ఏరా, ఓరేయ్, సైకో అని మాట్లాడుతున్నారు. అందుకే నేను కూడా తిట్టా. వాళ్లు మాట్లాడకూడదు. వాళ్ల పని వాళ్లు చేసుకోవాలి. మా పని మేము చేసుకుంటాం. బెజవాడ నుంచి పెనమలూరు నుంచి అమెరికా నుంచి వచ్చినోళ్లు, ఆస్ట్రేలియా నుంచి వచ్చినోళ్లు మమ్మల్ని తిట్టి వెళితే మేము ఊరుకోవాలా? చూస్తా, వింటూ ఊరుకోవాలా? వాళ్ల పార్టీ ఏం పని చేసిందో చెప్పుకోమనండి. లేదంటే రాజకీయంగా మేము ఏం తప్పు చేశామో చెప్పమనండి. ఏరా, ఓరేయ్, సైకోగా, గడ్డం గ్యాంగ్ గా.. ఇలా మాట్లాడితే ఊరుకుంటామా?’ అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు.

సోమవారం సాయంత్రం మొదలైన హై టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. కొన్ని గంటలుగా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ఆందోళనకారులు కారుకి నిప్పంటించారు. టీడీపీ నేత చిన్నా కారుని తగలబెట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు మరోసారి రోడ్డెక్కారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అలాగే గన్నవరం వస్తున్న టీడీపీ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న చంద్రబాబు.. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఆఫీస్ లోని సామాగ్రి ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో ఉంచిన కారుకి నిప్పంటించారు. టీడీపీ ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.