Visakha Gas Leak : విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్.. 50మందికిపైగా అస్వస్థత

విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మ‌హిళా ఉద్యోగులు అస్వ‌స్థ‌త‌కు గు‌రయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచ‌నాలు చేసుకుని స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన కంపెనీ యాజ‌మాన్యం అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని వెంటనే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించింది.

Visakha Gas Leak : విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్.. 50మందికిపైగా అస్వస్థత

Visakha Gas Leak : విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మ‌హిళా ఉద్యోగులు అస్వ‌స్థ‌త‌కు గు‌రయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచ‌నాలు చేసుకుని స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన కంపెనీ యాజ‌మాన్యం స్పందించింది. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని ఆసుపత్రులకు తరలించింది.

మంగళవారం అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ అపెరిల్‌ సిటీ పరిధిలోని క్వాంటామ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ ను పీల్చిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, గతంలో ఇదే సెజ్ లో విషవాయువు లీక్ అయ్యింది. ఆ ఘటనలో 400 మందికిపైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు కంపెనీని మూసేశారు. ఇటీవలే కొన్ని షరతులతో కంపెనీని తెరుచుకోవచ్చని పొల్యూషన్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ, కొన్ని రోజుల్లోనే మరోసారి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది.

ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. దాదాపు 200ల మందికి పైగా సిబ్బంది ప్రస్తుతం అక్కడ ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు అందుతున్న సమచారం ప్రకారం 50 మందికిపైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అస్వస్థతకు గురైన వారందరూ మహిళలే. గ్యాస్ ధాటికి ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలిపోయారు. ఇతర సిబ్బంది వారిని సంస్థ వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం, యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఈ బ్రాండెక్స్ నుంచి విష వాయువులు బయటకు రావడం ఇదే తొలిసారి కాదు. గత జూన్ నెలలో రెండు సార్లు విష వాయువులు బయటకు రావడం కలకలం రేపింది. ఇప్పుడు మూడోసారి అదే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు.

ఇక గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. అధికారులతో మాట్లాడి ఆయన వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి అమర్నాథ్.