Andhra Pradesh : గుడ్ న్యూస్, ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. .గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.

Andhra Pradesh : గుడ్ న్యూస్, ఏపీలో తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా 15 వేల నుంచి 20 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. అయితే..గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.

84 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 60 వేల 124 శాంపిల్స్ పరీక్షించగా..14 వేల 986 మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీని కారణంగా పశ్చిమ గోదావరిలో 12 మంది, గుంటూరులో 12 మంది, తూర్పు గోదావరిలో 10 మంది,

విశాఖపట్టణంలో 9 మంది, నెల్లూరులో 8 మంది, విజయనగరంలో 8 మంది, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు.

గడిచిన 24 గంటల్లో 16 వేల 167 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,74,28,059 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 12,99,694 పాజిటివ్ కేసులకు గాను..11 లక్షల 01 వేల 536 మంది డిశ్చార్జ్ కాగా..8 వేల 791 మంది మృతి చెందారని..ప్రస్తుతం 1,89,367 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 639. చిత్తూరు 1543. ఈస్ట్ గోదావరి 2352. గుంటూరు 1575. వైఎస్ఆర్ కడప 1224. కృష్ణా 666. కర్నూలు 948. నెల్లూరు 1432. ప్రకాశం 639. శ్రీకాకుళం 1298. విశాఖపట్టణం 1618. విజయనగరం 629. వెస్ట్ గోదావరి 423. మొత్తం : 14,986.

Read More : తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి