CM Jagan Goshala : సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల.. అప్‌డేటేడ్ టెక్నాలజీతో నిర్మాణం

ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా

CM Jagan Goshala : సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల.. అప్‌డేటేడ్ టెక్నాలజీతో నిర్మాణం

Cm Jagan Goshala

CM Jagan Goshala : ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా చాలా హడావుడిగా ఉండే ఈ ప్రాంతం ఇకపై పల్లెటూరిలా కనువిందు చేయనుంది. పచ్చని చెట్లు, మధ్యలో చిన్న చెరువులు, అందులో కలువలు.. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా సీఎం ఇంటి సమీపంలోనే ఓ క్రియేటెడ్ విలేజ్ రూపుదిద్దుకుంటోంది. ఎంత టెన్షన్ తో ఉన్నా అక్కడికి వెళితే చాలు చాలా రిలీఫ్ ఫీలయ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి ఎదురుగా సుందరమైన గోశాల నిర్మాణం జరుగుతోంది. నూతన టెక్నాలజీతో అచ్చం పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేలా ఈ గోశాలను నిర్మిస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో నిర్మాణం జరుగుతుండగా, సీఎం సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ పనులు చేయిస్తున్నారు. తమకు కావాల్సిన విధంగా గోశాల నిర్మాణం జరిగేలా చూసుకుంటున్నారామె. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సీఎం నివాసానికి ఎదురుగా ఉన్న ప్లేస్ లో అప్ డేటేడ్ టెక్నాలజీతో గోశాల నిర్మాణం జరుగుతోంది. గోవులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పేరుకే గోశాల అయినా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు వైఎస్ భారతి.

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే…

గోశాల ప్రత్యేకతలు..
* హైటెక్ టెక్నాలజీతో నీళ్ల తొట్టెలు
* నీరు తాగేందుకు తల పెట్టగానే తాగేందుకు నీరు వచ్చేలా ఏర్పాట్లు
* మొత్తం 15 గోవులు ఉండేలా గోశాల నిర్మాణం
* గోశాలలో ఉంచేందుకు మేలు రకం దేశవాళీ ఆవుల ఎంపిక
* గోశాల ప్రాంగణంలో చిన్న చెరువులు, వాక్ వేలు