వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌

వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌

guntur asha activist brain dead : భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..అక్కడకక్కడ కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ వికటించి..ఆశా కార్యకర్తకు బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం అందుతోంది. మరో ఏఎన్ఎం అస్వస్థతకు గురై కోలుకొంటోంది.

తాడేపల్లి పీహెచ్ సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. తర్వాత..ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ రాగా..విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో సృహ కోల్పోయింది. దీంతో వీరిద్దరినీ ఈ నెల 22వ తేదీన…GGHలో చేరిపించారు.
లక్ష్మికి రియాక్షన్ వచ్చిందని, చికిత్స అందించినట్లు..ఆమె పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని జీజీహెచ్ వైద్యులు వెల్లడించారు.

కానీ..ఆశా కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ కు గురైనట్లు తేల్చారు. శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా…విజయలక్ష్మికి వేసిన వయల్ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా..అతనికి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్ వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ జీజీహెచ్ కు చేరుకున్నారు. వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు.