Ganta Srinivasa Rao : సెగలు రేపుతున్న గంటా శ్రీనివాసరావు కామెంట్స్..వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ హింట్

ఉత్తరాంధ్రలో మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రాలో సెగలు రేపుతున్నాయి.

Ganta Srinivasa Rao  : సెగలు రేపుతున్న గంటా శ్రీనివాసరావు కామెంట్స్..వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ హింట్

Andhra pradesh Ganta Srinivasa Rao Operation Start : ఏపీకి ఉత్తరాన.. చాలా రోజుల తర్వాత గంట గట్టిగా మోగుతోంది. ఈసారి.. కాస్త పెద్ద సౌండే వినిపిస్తుందండోయ్. అది కూడా.. స్టేట్ పాలిటిక్స్‌ని షేక్ చేసే వైబ్రేషన్‌తో. స్టీల్ ప్లాంట్ ఇష్యూ తర్వాత సైలెంట్‌గా.. సైడ్ అయిపోయిన గంటా శ్రీనివాసరావు.. మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయని.. ఇంట్రస్టింగ్ హింట్ ఒకటి ఇచ్చారు. ఇన్నాళ్లూ లేనిది.. గంటా.. ఈ వార్నింగ్ బెల్ ఎందుకు మోగించారన్నే ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

Also read : AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

ఏపీలో వందలకొద్దీ లీడర్లున్నారు. వాళ్లలో కొందరు ఎన్నో మాట్లాడతారు. ఏవేవో చెబుతారు. ఇంకొందరు తక్కువ మాట్లాడినా.. దాని తర్వాత పరిణామాలు పెద్దగా ఉంటాయ్. గంటా శ్రీనివాసరావు కూడా ఆ లిస్టులోకే వస్తారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే లీడర్ కాదు. ఆయనేదైనా చెప్పారంటే.. కచ్చితంగా దాని వెనుక పెద్ద రీజనే ఉంటుందన్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా అలాంటి.. సెన్సేషన్‌తోనే మళ్లీ వచ్చారు.

2024 ఎన్నికల కోసం గంటా మాంఛి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. కొడితే.. గట్టిగా కొట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. కేబినెట్ విస్తరణ తర్వాత.. వైసీపీలో ఒక్కసారిగా చెలరేగిన అసమ్మతి సెగలు, అలకలు, కోపాలు, తాపాలు.. గంటా గారిని బాగానే అట్రాక్ట్ చేశాయనే చర్చ మొదలైంది. దాంతో.. తన స్టైల్లో రాజకీయం మొదలుపెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత.. ఈ మధ్యే టీడీపీ ఆఫీస్‌కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు శ్రీనివాసరావు.. కొన్ని పాయింట్స్‌ని టచ్ చేశారు. సీనియర్ మంత్రి బొత్స.. ఎందుకు జగన్ రివ్యూకు హాజరు కాలేదని.. ఓ క్వశ్చన్ రైజ్ చేశారు. అంతేకాదు.. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి.. జిల్లాకు మంత్రి పదవి ఎందుకివ్వలేదని మరో పాయింట్ లాగారు.

Also read : YCP : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

గంటా చెప్పిన రెండు పాయింట్స్ వెనుక విషయం చాలానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. అది అవంతికే ఇవ్వాలి. మరి.. ఆయన్ని సైడ్ చేసి గుడివాడ అమర్నాథ్‌కి ఎందుకిచ్చారు? ఇక.. ఉత్తరాంధ్రలో బిగ్ పొలిటికల్ ఫిగర్‌గా ఉన్న బొత్స ప్రస్తావన తెచ్చి.. ఆయన మీదా ఓ లుక్ వేశారని తెలుస్తోంది. బయటకు.. వీళ్లిద్దరి పేర్లు మాత్రమే చెప్పినా.. గంటా పర్సులో లిస్టులో ఇంకా పెద్దదే ఉందనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో.. వైసీపీ నుంచి తెలుగుదేశం వైపు భారీ స్థాయిలో వలసలు ఉంటాయని.. అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారనే.. హింట్ ఇచ్చారు.

ప్రస్తుతానికి.. గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారు కాబట్టి.. అధిష్టానం ఆ ఆరు జిల్లాల వైపు చూసుకోవాల్సిన అవసరం లేదు. గంటా గనక.. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే.. విశాఖలో ఫ్యాన్ పార్టీకి చిక్కులూ, చికాకులు తప్పవంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటాకు గట్టి పట్టుంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ కోసం.. ఆ 3 జిల్లాలను చూసుకున్నది.. కాసుకున్నది ఆయనే. 2014లో టీడీపీలోకి జంప్ అయి.. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. గత ఎన్నికల టైంలోనూ.. సైకిల్ దిగి.. ఫ్యాన్ గాలి కింద రిలాక్స్ అవుదామనుకున్నారు. కానీ.. సహచరుడు అవంతి శ్రీనివాసరావు.. ఆయన కంటే ముందే వైసీపీలో చేరిపోయారు. గంటా చేరకుండా.. అడ్డుపుల్లలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు.. మళ్లీ అవంతికి మంత్రి పదవి పోవడంతో.. ఇద్దరి మధ్యా మళ్లీ పాత స్నేహం చిగురించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

జనం తనను మర్చిపోతున్నారనుకున్న టైంలో.. గంటా తన మార్క్ పాలిటిక్స్‌తో ఎంట్రీ ఇస్తారు. ఏడాది కింద స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా అంటూ హడావుడి చేశారు. తర్వాత కాపుల ఐక్యత పేరుతో వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు.. వైసీపీ నుంచి టీడీపీకి వలసలంటూ కొత్త సెగలు రేపుతున్నారు. ఓ వైపు.. ఉమ్మడి విశాఖలో కాపు సామాజికవర్గం పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. విశాఖ సిటీలో మిగతా పార్టీల నాయకులకు టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల వరకు.. పూర్తిస్థాయిలో యాక్టివ్ అయ్యే ఆలోచనలో ఉన్నారని.. లోకల్ లీడర్స్ చెవులు కొరుక్కుంటున్నారు. తాను పాలిటిక్స్ నుంచి ఫేడ్ అవుట్ అవలేదనే విషయాన్ని తెలియజేసేందుకే.. సర్కారుపై విమర్శల డోస్ కూడా పెంచారనే టాక్ వినిపిస్తోంది. ఇక.. ఇదే టైంలో గంటా శ్రీనివాసరావు కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో ఉన్నట్లు.. కేడర్ లో చర్చ జరుగుతోంది.