Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడిందని, ఆయా పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. ఈ కారణంగా అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు. 48 గంటల్లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

heavy rains

Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడిందని, ఆయా పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. ఈ కారణంగా అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు. 48 గంటల్లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఏపీలో కొన్ని వారాల క్రితం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..