Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌..మరో మూడ్రోజులు భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గ్యాప్‌ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌..మరో మూడ్రోజులు భారీ వర్షాలు

Heavy rains : ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గ్యాప్‌ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rains In Telangana : బుధ,గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు

ఏపీకి కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జుల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది.