Tirumala Rush : శ్రీవారి దర్శనానికి 16 గంటలు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

Tirumala Rush : శ్రీవారి దర్శనానికి 16 గంటలు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Tirumala Rush (1)

Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపుల మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. నారాయణగిరి ఉద్యానవనం, ఎంబీసీ సర్కిల్, టీబీసీ సర్కిల్, ఫిల్టర్ హౌస్ సర్కిల్ మీదుగా రాంభగీచ అతిథిగృహం వరకు క్యూలైన్లు బారులు తీరాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.

Tirumala : జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

తిరుమల కొండపై ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం ఉన్నారు. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో అనూహ్యంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 33 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో 9 షెడ్లు ఉంటాయి. అవి కూడా భక్తులతో నిండిపోయాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్ల మీదకు క్యూలైన్లు వచ్చాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

నిన్నటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. శనివారం కావడంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ అందిస్తోంది. సేవకులను ఏర్పాటు చేసిన టీటీడీ.. వారి ద్వారా భక్తులకు నీరు, మజ్జిగ సరఫరా చేస్తోంది. కరోనా కారణంగా భక్తులు రెండున్నరేళ్లుగా స్వామి వారి దర్శనానికి దూరం అయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మరోవైపు వేసవి సెలవులు కావడంతో ఒక్కసారిగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నెల రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో వీకెండ్స్ లోనే తిరుమలలో భక్తుల రద్దీ కనిపించేది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నెల మొత్తం కూడా భక్తుల రద్దీ ఉంది. ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్న టీటీడీ.. సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తుల దర్శనానికి టీటీడీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారాంతాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది. వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు.