Tirumala : శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలో నడిచే శ్రీవాణి ట్రస్ట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది. 

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

Tirumala Sri Vani Trust

Tirumala :  తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలో నడిచే శ్రీవాణి ట్రస్ట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది.  కొంతమంది వ్యక్తులు కావాలని శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈరోజు టీటీడీ విడుదల చేసిన ఒక ప్రకటనలో …. రాజకీయ, వ్యక్తిగత ప్రచారాలు ఆశించి హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ మీద అవాకులు, చెవాకులు పేలడం రివాజుగా మారింది.

సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల, అటవీ గ్రామాలకు సైతం విస్తరించే లక్ష్యం తో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో దళారీ వ్యవస్థ సైతం పూర్తిగా కనుమరుగైంది. టికెట్ ధర పెట్టుకోగలిగే ఆర్థిక స్థోమత ఉన్న వారు ఎవరి సిఫారసు కోరకుండా, దళారీల బారిన పడి మోసపోకుండా శ్రీవాణి టికెట్ కొని నేరుగా స్వామివారి దర్శనం చేసుకోగలుగుతున్నారని పేర్కోంది.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి పైసా మారుమూల గ్రామాల్లో హిందూ ఆలయాలు, పురాతన ఆలయాల మరమ్మత్తులు, అభివృద్ధి, పునర్ నిర్మాణం కోసమే ఉపయోగిస్తున్నాము. ఈ నిధుల ద్వారా గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 501 ఆలయాలు నిర్మించాము. రాబోయే రెండేళ్ళలో 1030 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కొన్ని వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.

వాస్తవాలు ఇలా ఉంటే కొందరు శ్రీవాణి ట్రస్ట్ మీద అవాస్తవాలు చెబుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరం. ఇలాంటి వ్యక్తుల మీద, వారి అవాస్తవ ఆరోపణలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ ఆ ప్రకటనలో హెచ్చరించింది.

Also Read : Amaravati : అమ‌రావ‌తి శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ 9న మ‌హాసంప్రోక్ష‌ణ, ప్రాణప్రతిష్ట