Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభం

శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభమైంది. ముంబైకి చెందిన హైడ్రోగ్రాఫిక్ నిపుణులు సర్వే చేస్తున్నారు. నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టింది.

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభం

Srisailam (2)

Hydrographic survey Srisailam : శ్రీశైలం ప్రాజెక్టులో హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రారంభమైంది. ముంబైకి చెందిన హైడ్రోగ్రాఫిక్ నిపుణులు సర్వే చేస్తున్నారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు, పూడికపై నిపుణుల బృందం హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టింది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు నాలుగు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్నారు. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత మేరకు చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటి నిల్వ 308.62 టీఎంసీలుగా ఉంది. 2009లో అనూహ్యంగా వచ్చిన వరదలతో నీటి నిల్వ 215.807 టీఎంసీలకు పడిపోయింది. అప్పట్లో వచ్చిన వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు 93 టీఎంసీల నీటి నిల్వను కోల్పోయింది. 2009 అక్టోబరు 2 న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి ప్రవేశించింది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నిర్వహణను కృష్ణా నది యజమాన్య బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి నిల్వను మరోసారి నిర్ధారించేందుకు సర్వే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ సర్వే చేపట్టారు.

గత పదేళ్లలో శ్రీశైలం జలాశయంలో పూడిక ఏ మేరకు చేరిందో గుర్తించేందుకు సర్వే చేస్తున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. ఈ సర్వే 15 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు సర్వే పూర్తైన తర్వాత కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుపనున్నట్లు తెలిపారు.